Saturday, September 17, 2011

BHARATHEYEDU

తెప్పలెళ్లి పోయాక
ముప్పు తొలిగిపోయిందే చిన్నమ్మా
నట్టనడి రాతిరిలో
నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా
ఉదయం వరకూ పోరాడినా
రుధిరంలోనే నడయాడినా
గడ్డిపోచ కత్తై దుఃఖమంతా ధూళైతే
చిన్నమ్మా... చిన్నమ్మా...
ఇంటి వాకిలి వెతికి...
ఆకాశం చిరుజల్లులు కురియును మనకోసం
ఎదలో మరగే శోకం అంతా



వన్నెల చిన్నెల నీటి ముగ్గులే
బుగ్గపై కన్నులే వేయ
ఇంకను తప్పదా పోరాటం
ఈడ నే ఆడ ను పోరాడ
నిన్ను అడిగే హృదయం పంచుకుంటినా
ప్రతిరోజూ ముళ్లపై పవళించినా
నేనో నదిని చినుకై రావా
అమ్మమ్మ ఇన్నాళ్లు నీకై వేచి ఉంటినే
నేడు.



నేస్తమా నేస్తమా నీకోసం
గాలినై వచ్చినా నేడు
పువ్వులో తేనెలా నీరూపం
గుండెలో దాచినా చూడు
నీ కాలికి మట్టినై తోడువుండనా
కనుపాపకి రెప్పలా కావలుండనా
ఆశనై కోరి శ్వాసనై చేరి
కౌగిట్లో జోకొట్టి గుండె హారతివ్వనా

No comments:

Post a Comment

Popular Posts