Thursday, September 8, 2011

ee mounam

ఈ మౌనం... ఈ బిడియం...
ఇదేనా ఇదేనా చెలియ కానుక
ఈ మౌనం... ఈ బిడియం...
ఇదేలే ఇదేలే మగువ కానుక... ఈ మౌనం...


ఇన్నినాళ్ళ మన వలపులు
వికసించుట ఇందుకా 
మమతలన్ని తమకు తామె 
అల్లుకొనెడి మాలిక... ఆ... ఆ...॥మౌనం॥

 మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక
అహ... ఓహొ... ఆ....
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక
కనులు కలిసి అనువదించు
ప్రణయ భావగీతిka


ఏకాంతము దొరికినంత ఎడమోమా నీవేడుక
ఏకాంతము దొరికినంత ఎడమోమా నీవేడుక
ఎంత ఎంత ఎడమైతే... 
అంత తీపి కలయిక... ఆ...
 

No comments:

Post a Comment

Popular Posts