Friday, September 23, 2011

telugu veera levara

తెలుగు వీర లేవరా! దీక్ష బూని సాగరా
దేశమాత స్వేఛ్ఛ కోరి తిరుగుబాటు చేయరా



దారుణమారణకాండకు తల్లడిల్లవద్దురా

నీతిలేని శాసనాలు నేటినుండి రద్దురా

నిదురవద్దు బెదరవద్దు 
నింగి నీకు హద్దురా

తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా 

దేశమాత స్వేఛ్ఛ కోరి తిరుగుబాటు చేయరా!

ఎవడువాడు ఎచటివాడు?
ఎటువచ్చిన తెల్లవాడు

కండబలం గుండెబలం

కబళించే దుండగీడు

మానధనం ప్రాణధనం

దోచుకొనే దొంగవాడు

తగినశాస్తి చేయరా

తరిమి తరిమి కొట్టరా!

తెలుగు వీర లేవరా  దీక్ష బూని సాగరా

దేశమాత స్వేఛ్ఛ కోరి తిరుగుబాటు చేయరా


ఈదేశం ఈరాజ్యం నీదే అని చాటించి

ప్రతివ్యక్తి తొడలుగొట్టి శృన్ఖలాలు పగులగొట్టి

చురకత్తులు పదునుపెట్టి తుది సమరం మొదలుపెట్టి

సింహాలై గర్జించాలి, సంహారం సాగించాలి

తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా

దేశమాత స్వేఛ్ఛ కోరి తిరుగుబాటు చేయరా

No comments:

Post a Comment

Popular Posts